
AMPM Live : పచ్చని ప్రకృతి సౌందర్యం... ఎత్తైన పర్వత శిఖరాల నడుమ సహజసిద్ధంగా ఏర్పడిన ప్రాంతం ‘ముడసర్లోవ రిజర్వాయర్’. విశాఖవాసుల దాహార్తిని తీర్చిన మొట్టమొదటి రిజర్వాయర్ గా ముడసర్లోవకు ఘనమైన చరిత్ర ఉంది. ఒక వైపు సింహాచల పర్వతాలు, మరో వైపు ఈశాన్య పర్వత శ్రేణి మహా పర్వతo పై నుంచి జాలువారే ఔషధ జలాలతో ఈ జలాశయం నిండుకుండలా దర్శనమిచ్చేది. సుమారు 75 ఎకరాల్లో, 169 అడుగుల నీటి నిల్వ సామర్ధ్యంతో ముడసర్లోవ రిజర్వాయర్ విస్తరించి ఉంది. 1902లో మొదటి సారిగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ జలాశయాన్ని గుర్తించింది. పర్వత శ్రేణులపై నుంచి వచ్చే నీరు ఇక్కడ సహజంగా నిల్వ కావడంతో ఈ ప్రాంతంలో రిజర్వాయర్ ను నిర్మించి విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగించారు. 1965లో జీవీఎంసీ ఈ జలాశయాన్ని వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ గా మార్చి నగరప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
100 years old mudasarlova reservoir facing water crisis now - YouTube |
| 6 Likes | 6 Dislikes |
| 504 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 23 May 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét