
AMPM Live : మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి మూడేళ్ల పసి ప్రాణాన్ని పొట్టనపెట్టుకున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మారేడుపూడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మారేడుపూడి కాలనీకి చెందిన బాబురావు మద్యానికి బానిసయ్యి తరచూ భార్య పార్వతితో గొడవపడేవాడు. దీంతో గత కొద్ది రోజులుగా పార్వతి తన ఇద్దరు పిల్లలతో కలిసి తన పుట్టినిల్లయిన కశింకోట మండలం పరవాడపాలెంలో ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం బాబురావు తన తల్లితో కలిసి భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అక్కడ తన భార్యతో గొడవపడి కుమారుడు దినేష్ (3) ను మారేడుపూడి తీసుకువచ్చాడు. మంగళవారం ఉదయం మద్యం మత్తులో ఉన్న బాబురావు ఆడుకుంటున్న కొడుకును అతి పాశవికంగా గునపాంతో పొడిచి చంపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారo ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అనకాపల్లి రూరల్ సి.ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మరణవార్త విన్న తల్లి పార్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. దినేష్ మృతితో గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
AMPM Live : Father Killed 3 Years Old Son in Anakapalli - YouTube |
| 1 Likes | 1 Dislikes |
| 138 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 14 Nov 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét