
AMPM Live : మిస్ వైజాగ్ 2017 అందాల పోటీలకు సంబంధించిన ఆడిషన్స్ నగరంలోని బుదిల్ పార్క్ హోటల్ లో సందడిగా జరిగాయి. యువతులు ర్యాంప్ పై వాక్ చేస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. ఆడిషన్స్ లో పాల్గొన్న యువతులు చిరునవ్వులు చిందిస్తూ, తమ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసారు. ఈ పోటీలపై మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో సాంప్రదాయరీతిలో మిస్ వైజాగ్ పోటీలను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు ఆడిషన్స్ లో పాల్గొన్న యువతులను తమ తల్లిదండ్రులతో రావాల్సిందిగా కోరారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అనుమతితోనే చీరలు, గాగ్రా చోళీ వంటి వస్త్రదారణలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ మేనేజర్ తెలిపారు. మొదటి ఆడిషన్స్ లో 120 మంది పాల్గొనగా వారిలో 12 మంది ఎంపికయ్యారు. రెండవ ఆడిషన్స్ లో మరో 10 మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన 22 మందికి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే యోగా, ధ్యానం, జుంబా నృత్యాల్లో తర్ఫీదునిస్తామని నిర్వాహకులు దాడి రవికుమార్, అజయ్ అగర్వాల్, ఆష్రఫ్ ఖాన్ లు వెల్లడించారు. డిసెంబర్ నెలలో మిస్ వైజాగ్ 2017 పోటీలను నిర్వహించనున్నారు.
AMPM Live : Miss Vizag 2017 Auditions || Budhil Park Hotel || Visakhapatnam - YouTube |
| 6 Likes | 6 Dislikes |
| 1,069 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 7 Nov 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét