
AMPM Live : విశాఖపట్నంలోని మర్రిపాలెం రైతు బాజార్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యోగా గురువు పొలమరశెట్టి వెంకటనారాయణను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. పోలీసుల ప్రాధమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమై ఉంటుందని భావించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హతుడు వెంకటనారాయణకు, అతడి బంధువు కిలపర్తి వెంకటరమణకు తాగాదాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కిలపర్తి వెంకటరమణపై ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో వెంకటరమణను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. యోగా టీచర్ ను హత్య చేసేందుకు వెంకటరమణ కొందరు కిరాయి గూండాలను పురమాయించినట్లు తెలుస్తోంది. డబ్బు ముట్టజెప్పడంలో తేడాలు రావడంతో గూండాలు కిలపర్తి వెంకటరమణపైనే దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
AMPM Live : New Twist in Visakhapatnam Yoga Teacher Murder - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 1,822 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 28 Jan 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét