
AMPM Live : సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరికీ పల్లె వాతావరణం కళ్లముందు కనిపిస్తుంది. సంక్రాంతి ముగ్గులు, కోడిపందాలు, పిండివంటకాలు, ఆటపాటలతో గ్రామీణ ప్రాంతాలు కొత్త కళను సంతరించుకుంటాయి. పట్టణాల్లో ఉండే అధికశాతం ప్రజలు పల్లె ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారే కావడంతో పండుగ రోజున పట్నంవాసులంతా పల్లె బాట పడుతున్నారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో పిల్లా పాపలతో, కుటుంబ సభ్యులతో సొంతూర్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సులు, ఆర్టీసీ బస్టాండ్లు, రైళ్లు, స్టేషన్లు ఇసుకవేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖ రైల్వేస్టేషన్ ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగకు విశాఖ నుంచి రాష్ట్రంలోని నలుమూలలకు ఎంత సంఖ్యలో ప్రజలు వెళతారో.. అంతే సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు విశాఖకు వస్తుంటారు. ప్రముఖ పర్యాటక ప్రదేశంలో కావడంతో ఒడిస్సా, తెలంగాణా, చత్తీస్ ఘడ్, వెస్ట్ బెంగాల్ నుంచి పర్యాటకులు విశాఖకు వస్తారు. దీంతో రిజర్వేషన్లు దొరకక, రైళ్ళు ఖాళీ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
AMPM Live : Passengers Rush at Railway Stations & Bus Stands in Visakhapatnam - YouTube |
| 1 Likes | 1 Dislikes |
| 41 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 12 Jan 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét