
AMPM Live : అంతా అనుకున్నట్లే జరిగింది. తెలంగాణా తెలుగుదేశం పార్టీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ తన నివాసంలో రేవంత్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని ఆకాంక్షించారని.. అందుకే ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేసారు. కేసీఆర్ పాలనలో తెలంగాణా రాష్రంరయ దోపిడీకి గురవుతుందని అన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులే మంత్రి పదవుల్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. గత 40 నెలల్లో 3,400మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ నాయకత్వంలో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని రేవంత్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి తో పాటూ మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ బలం పుంజుకోవడంతో టీడీపీ నేతలు కాస్త అసంతృప్తి చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
AMPM Live : Revanth Reddy former Telangana TDP Leader joins Congress in the presence of Rahul Gandhi - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 22 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 31 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét