
AMPM Live : ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్తా సముద్ర తీరంలో ఏప్రిల్ 15 నుంచి చేపల వేటపై నిషేధం అమల్లోకి వచ్చింది. రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం మూలంగా లక్షలాది మత్య్సకారుల కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్ధకంలో పడింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లతో... వ్యాపార లావాదేవీలతో నిత్యం కళకళలాడే ఫిషింగ్ హార్బర్ నిర్మానుష్యంగా మారింది. సముద్రంలో చేపల పునరుత్పత్తికి, సంతతి పెరుగుదలకు వీలుగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ 61 రోజుల పాటు దేశంలోని తూర్పు తీరంలో వేటను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వేటకు మోటార్ బోట్లు, ట్రాలర్ల వంటి పెద్ద మెకనైజ్ పడవలతో వేటాడ్డం పై ఈ నిషేధం వర్తిస్తుంది. వేట నిషేధ సమయంలో ఉపాధి కరువైన మత్స్యకార్ల కుటుంబాలకు 40 కేజీల బియ్యం, 2 వేల రూపాయలను ప్రతీ కుటుంబానికి ఇవ్వాలనే నిబంధన వుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో నాణ్యత లేకపోవడం.. ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావడంతో మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఉపాధి భత్యం క్రింద రూ.4వేల నగదును అందజేస్తుంది. నిషేధ కాలం అయిపోయాక ఆర్ధిక సాయాన్ని విడుదల చేయడం, అర్హులైన మత్స్యకార్ల కుటుంబాలను గుర్తించడం వంటి కారణాల మూలంగా నిషేధ కాలంలో మత్యకార్లు ఇబ్బందులు పడుతున్నారు. వేట నిషేధ కాలంలో సాయం అందడంలేదని ఆవేదన చెందుతున్నారు. కెమికల్ పరిశ్రమల వ్యర్ధాలు సముద్రం కలవడం మూలంగా మత్స్యసంపదకు నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు బోట్లు నిషేధ కాలంలో వేటకు వెళ్లడంతో నష్టం మరింత పెరుగుతుందని మత్స్యకార నాయకులు వాపోతున్నారు. ప్రభుత్వం దీనిపై పటిష్ట చర్యలు అమలు చేయాలని... నిషేధ సమయంలో మత్స్యకారులకు ఉపాధి భత్యం క్రింద రూ.9 వేలు అందించాలని కోరుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది అయినా సమగ్ర సహాయ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Annual Fishing Ban || Special Story || Visakhapatnam - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 60 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 23 Apr 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét