
AMPM Live : విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు టెక్ (ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీ) 2017 సదస్సు దోహదపడుతుందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. విశాఖ నోవాటెల్ లో జరుగుతున్న 3వ రోజు టెక్ సదస్సులో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికత సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ పురోభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఏపీ ఎన్నారై, జన్మభూమి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులు విద్యార్ధులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. విద్యార్ధులకు ఒత్తిడి లేని విద్య అందించేందుకు ఈ సదస్సులో వర్చువల్ రియాలిటీ పరిజ్ఞానం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆధునిక యాప్స్ వంటి తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
AP Govt Special Representative (North America ) Komati Jayaram Speech in TECH 2017 II AP Janmabhoomi - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 42 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 18 Dec 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét