
AMPM Live : రామకృష్ణ బీచ్ రోడ్డులో ‘విన్నర్స్ వాక్’ – ముఖ్య అతిధిగా హాజరైన బాలకృష్ణ విశాఖపట్నం, అక్టోబర్ 28: అవగాహనతో క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడవచ్చని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో శనివారం నిర్వహించిన ‘విన్నర్స్ వాక్’ లో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ నటి గౌతమి ఆధ్వర్యంలో ‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఈ మార్చ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన బాలకృష్ణ యువతతో కలిసి కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు విన్నర్స్ వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పేదలకు క్యాన్సర్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని తన తండ్రి ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. 40 పడకలతో మొదలైన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 512 పడకలు ఉన్నాయన్నారు. ఆస్పత్రి ద్వారా అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. అనంతరం క్యాన్సర్ వ్యాధిని జయించిన పలువురికి అభినందన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Balakrishna and Gauthami Cancer awareness walk in Vizag - YouTube |
| 1 Likes | 1 Dislikes |
| 106 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 28 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét