
AMPM Live : కొబ్బరి చెట్ల నీడన సేద తీరుతూ.. సాగరతీరాన్ని ఆస్వాదించడం ఒక అందమైన అనుభూతి. అయితే ఈ అవకాశం ఆర్.కె.బీచ్ లో లేకపోవడం గమనార్హం. దీనిని దృష్టిలో ఉంచుకుని సన్ రే రిసార్ట్స్ ఎండి రాజాబాబు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే ఆర్.కె.బీచ్ లో కొబ్బరి చెట్లను నాటేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఇసుక నేలలో కొబ్బరి మొక్కలు పెరిగే అవకాశం తక్కువ కావడంతో లేత కొబ్బరి చెట్లను నేరుగా తీరంలో నాటుతున్నారు. అవి బలంగా నిలిచేందుకు, ఎదిగేందుకు వీలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్.కె.బీచ్ సందర్శనకు వచ్చే టూరిస్టులు తీరంలో కొబ్బరి చెట్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయత్నం ద్వారా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి బీచ్ రోడ్డులో కొబ్బరి చెట్ల పెంపకానికి ముందుకు రావాలని సన్ రే రిసార్ట్స్ ఎండి రాజాబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Coconut Trees Attracts Tourists in R.K.Beach || Visakhapatnam - YouTube |
| 14 Likes | 14 Dislikes |
| 1,374 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 4 Sep 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét