
AMPM Live : విశాఖపట్నంలో కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అక్కయ్యపాలెం ఎన్జీఓఎస్ కాలనీలోని పద్మ భాస్కర అపార్ట్మెంట్లోని అయిదో ఫ్లోర్లో ఆమె నివాసం ఉంటున్నారు. ఉదయం నుంచి ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా బాత్ రూమ్ లో విజయారెడ్డి రక్తపు మడుగులో పడి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Congress Ex-Corporator Vijaya Reddy Found Dead in Her Flat || Visakhapatnam - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 388 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 26 Feb 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét