
AMPM Live : ప్రస్తుత రోజుల్లో పాత నాణేలు, కరెన్సీ, పోస్టల్ స్టాంప్ లకు ఆదరణ పెరుగుతోంది. పూర్వ కాలాన్ని గుర్తు చేసే వస్తువులు తమ వద్ద ఉంచుకోవడం, వాటిని భద్రపరచడం పలువురు హాబీగా మలచుకుంటున్నారు. వాటిని సేకరించడం వృత్తిగా.. వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. నగరాల్లో వీటిని ప్రదర్శనకు ఉంచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. విశాఖపట్నం రామ్ నగర్ లయన్స్ కమ్యూనిటీ హాల్ లో విస్నుపెక్స్ 2018 పేరిట ఏర్పాటు చేసిన నాణేలు, కరెన్సీ, పోస్టల్ స్టాంప్ ల ప్రదర్శన నగరప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. రాజుల కాలంలో వినియోగించిన బంగారు, వెండి, విదేశీ నాణేలు, ప్రముఖుల చిత్రాలతో కూడిన పాత స్టాంప్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటిని ప్రదర్శనతో పాటూ విక్రయానికి కూడా ఉంచడoతో తమకు నచ్చిన నాణేలు, పోస్టల్ స్టాంప్ లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. ముఖ్యంగా వ్యాపారులు రూపాయి, పది రూపాయల నోట్లపై తేదీ, నెల, సంవత్సరం తెలిపే నెంబర్ సిరీస్ ను అందుబాటులోకి తెస్తున్నారు. నచ్చిన వ్యక్తుల పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర ముఖ్యమైన తేదీలను ఆ నోట్ల రూపంలో బహుమతిగా అందజేయవచ్చు. దీని ద్వారా తమ జీవితంలో ముఖ్యమైన తేదీపై ఒక కరెన్సీ నోటు ఉందనే సంతృప్తి ప్రజల్లో కలుగుతుంది. 10 రూపాయల కరెన్సీకి రూ.100, రూ.1 కరెన్సీకి రూ.200 వ్యాపారులకు చెల్లించి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక పాత నాణేలు, పాత కరెన్సీని తమ ఇంట్లో భద్రపరుచుకునేందుకు కొందరు ఔత్సాహికులు ధర ఎక్కువైనా కొనుగోలుకు వెనకాడడం లేదు. దీంతో పాత నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శనలు ప్రజల్లో ఆసక్తిని నింపడమేకాకుండా.. వ్యాపారులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
Demand For Old Currency Gifts || Special Story || AMPM Live - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 39 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 13 Nov 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét