
AMPM Live : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం గత రెండు రోజులుగా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మంగళవారం సాయంత్రం వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో అవసరమైన వైద్యం అందించినా.. ఆయన ఆరోగ్యం మెరుగుపడడం లేదని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఆస్పత్రి వద్దకు పెద్దసంఖ్యలో అభిమానులు, నేతలు చేరుకుంటున్నారు. కరుణానిధి ఫొటోలను పట్టుకొని ఆయన కోసం కన్నీరు పెడుతూ ప్రార్థనలు చేస్తున్నారు. భారీగా అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటుండడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు.
DMK President Karunanidhi Health Condition Critical || Chennai - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 26 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 7 Aug 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét