
AMPM Live : విశాఖపట్నం ఉడా కార్యాలయంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ లోని కమర్షియల్ టాక్స్ ఆఫీస్ విభాగం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. చాలా వరకూ ముఖ్యమైన రికార్డులు కాలి బూడిదయ్యాయి. సాయంత్రం 5.30 ప్రాంతంలో బిల్డింగ్ నుంచి పొగలు రావడంతో ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసారు. ఉద్యోగభవన్ లోని సిబ్బంది మొత్తాన్ని అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మంత్రి గంటా అమెరికా పర్యటనలో ఉండడంతో అక్కడి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు సిబ్బంది చెబుతున్నారు.
Fire Accident in VUDA Office || Visakhapatnam - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 14 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 23 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét