
AMPM Live : వరంగల్ జిల్లా హన్మకొండ నయీమ్ నగర్ లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కళాశాలకు వెళ్తున్న యువతిని రోడ్డుపై అడ్డగించిన ఓ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో యువతి శరీరం 90 శాతం కాలిపోయింది. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతo యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హన్మకొండ ఏసీపీ చంద్రయ్య, సీఐ సంపత్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఘటన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. నిందితుడు, బాధిత యువతి ఒకే కళాశాలలో చదువుకుంటున్న వారిగా తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమా అనే కోణంలో పోలీసులు నిందితున్ని విచారిస్తున్నారు.
Girl Set on Fire by Stalker in Warangal || AMPM Live - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 50 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 27 Feb 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét