
AMPM Live : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి కన్యాకుమారిలో తుఫాను గా మారడంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ‘ఓక్కి తుఫాను’ గా నామకరణం చేసారు. ఓక్కి తుఫాను ప్రభావం తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై విపరీతంగా ఉండడంతో అధికారులు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. ఈదురుగాలుల ఉధృతికి వేలాది సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, వందల సంఖ్యలో చెట్లు నెలకూలాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించాలని, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్ అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఐదు రోజుల పాటూ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుఫాను ప్రభావం కేరళలో మరో 48 గంటలు, తమిళనాడులో మరో 24 గంటలపాటు ఉంటుందని.. తీరం వెంబడి 65 నుంచి 75 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.
Heavy Rains || Tamilnadu , Kerala || Ockhi Cyclone - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 46 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 30 Nov 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét