
AMPM Live : శాంతి చర్చలకు రమ్మంటూనే... కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన ‘సర్జికల్ స్ట్రైక్ 2’ తో పాక్ లోని ఉగ్రమూకలకు గట్టి సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. తర్వాత పాక్ విమానాలు భారత గగనతలంలోకి ఆక్రమంగా ప్రవేశించి దాడులకు పాల్పడే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. ఈ క్రమంలో పాక్ ఎఫ్-16 విమానాన్ని భారత్ కూల్చివేయగా.. భారత్‌కు చెందిన మిగ్ 21 బిసన్ విమానం పాక్‌లో కూలిపోయింది. ఈ విమానం నడుపుతున్న పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ సైన్యానికి బందీగా చిక్కాడు. ఆ సమయంలో కొందరు అభినందన్ పై దాడులకు పాల్పడి, హింసించిన వీడియోను పాక్ విడుదల చేసింది. తర్వాత పాక్ సైన్యం నిర్భంధంలో ఆయన క్షేమంగా ఉన్నారని మరో వీడియోను బయటపెట్టింది. దీంతో పాక్ చెరలో ఉన్న అభినందన్ ను ఏ విధంగా బయటకు తీసుకురావాలనే అంశంపై భారత ప్రభుత్వo కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాలను పాక్ కు గుర్తు చేస్తూ తమ పైలెట్ ను క్షేమంగా అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. మరో వైపు పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా మద్దతు లభించకపోవడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ ను శాంతి చర్చలకు ఆహ్వానించారు. పుల్వామా ఘటనకు సంబంధించి దర్యాప్తులో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. భారత పైలట్‌ను తిరిగి అప్పగించేందుకు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోయేందుకు సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పేర్కొన్నారు.
India-Pakistan Border Crisis || Updates || AMPM Live - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 163 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 28 Feb 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét