
AMPM Live : తెలుగు సినీ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీయార్ చిత్రం ‘జై లవకుశ’. గురువారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతుంది. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి కల్యాణ్‌రామ్ నిర్మాత. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లు. అలనాటి హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబుతో పాటూ నేటికీ తన చరిష్మాను చాటుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలు సైతం గతంలో త్రిపాత్రాభినయంతో అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ ‘కుమార్ రాజా’ శోభన్ బాబు ‘ముగ్గురు మొనగాళ్లు’ మెగాస్టార్ ‘ముగ్గురు మొనగాళ్లు’, బాలకృష్ణ ‘అధినాయకుడు’ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు . కమల్ హాసన్ ‘మైకేల్ మదన కామ రాజు’ చిత్రంలో ఏకంగా నాలుగుపాత్రల్లో అలరించారు. పెరుగుతున్న బడ్జెట్, కాల్షీట్ల సమస్య, సరైన కధలు దొరకని కారణంగా నేటి తరం హీరోలు ద్విపాత్రాభినయం చేయడమే అరుదయిపోయింది. అలాంటిది ‘జై లవ కుశ’ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ మూడుపాత్రల్లో మొదటిసారిగా నటించడం కత్తి మీద సాము అని చెప్పుకోవచ్చు.
Jai Lava Kusa || NTR || Tollywood || Entertainment - YouTube |
| 7 Likes | 7 Dislikes |
| 86 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 20 Sep 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét