
AMPM Live : శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో శనివారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్య సంచలనం రేపింది. కన్నెమెట్ట గ్రామంలోని మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఉన్న ప్రేమ జంటను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు కన్నెమెట్ట గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ (19), మొదలవలస గ్రామానికి చెందిన రేణుక (19)గా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే వీరి మృతికి కారణమైనట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. యువ జంట ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Lovers Commit Suicide In Srikakulam - YouTube |
| 5 Likes | 5 Dislikes |
| 2,378 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 2 Dec 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét