
AMPM Live : రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్న కేంద్రం సామాన్యుల నెత్తిన మరో బాంబు పేల్చింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరలు పెంచి షాకిచ్చింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పై రూ. 2.34, సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ పై రూ.48 చొప్పున ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. దీంతో దేశ రాజధానిలో ప్రస్తుత సబ్సిడీ సిలిండర్ ధర రూ. 493.55, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.698.50కు చేరుకొంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న సమయంలో వంట గ్యాస్ ధర కూడా పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
LPG Gas Cylinder Rate || Hiked by up to Rs 48 - YouTube |
| 1 Likes | 1 Dislikes |
| 59 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 1 Jun 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét