
AMPM Live : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 18న స్వామి వారి చందనోత్సవం సందర్భంగా గురువారం నుంచి చందనం అరగదీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి వారి ఆరాధన అనంతరం ఉదయం 6.30కు శ్రీ పాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రధానార్చక స్వామి తొలిచెక్కను అరగదీసి చందనం అరగదీత ప్రక్రియను మొదలుపెట్టారు. కేరళ నుంచి మేలురకం చందనం చెక్కలను తీసుకువచ్చి ఆలయంలోని బేడామండపంలో అమర్చిన ప్రత్యేక రాళ్లపై ఆలయ అర్చకులు చందనాన్ని అరగదీస్తారు. అరగదీసిన గంధంలో అర్చకులు 60 రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు మిళితం చేస్తారు. శ్రీగంధాన్ని ప్రతిరోజు ఆలయ స్థానాచార్యులు తూకం వేసి భద్రపరుస్తారు. సంవత్సరమంతా నిత్య రూపంలో దర్శనమిస్తూ... వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే నిజరూపంతో స్వామి వారు దర్శనమివ్వడం విశేషం. నిజరూప దర్శనం తరువాత స్వామి వారిపై చందనం పూత వేస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ర్వ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
Making of 'Chandanam' Paste Begins at Simhachalam - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 147 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 12 Apr 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét