
AMPM Live : విశాఖపట్నంలోని పెందుర్తి పోలిస్ స్టేషన్ ఎదురుగా బుధవారం ఓ వ్యక్తి పెట్రోలు పోసుకుని అత్మహత్యకు పాల్పడ్డ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెలితే.. నగరంలోని రామాలయం వీధిలో మహాలక్ష్మినాయుడు అనే వ్యక్తి గత అక్టోబర్ లో భార్యను క్రికెట్ బాట్ తో కొట్టి హత్యచేసి జైలుకెల్లాడు. ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. గత నాలుగు రోజులుగా అతడి భార్యకు సంబంధించిన బంధువులుతో గొడవలు జరగటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మహాలక్ష్మినాయుడు పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదురుగా అందరు చూస్తుండంగానే వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పెందుర్తి పోలిసులు క్షతగాత్రుడిని కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Man Attempted Suicide at Pendurthi Police Station || Visakhapatnam - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 1,222 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 10 Jan 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét