
AMPM Live : మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే మావోయిస్టులు మందుపాతరలతో చెలరేగిపోయారు. బుధవారం గడ్చిరోలి జిల్లా జాంబీర్ కేడ్ అటవీ ప్రాంతంలో క్విక్ రెస్పాన్స్ పోలీస్ టీమ్ వెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు బాంబు దాడి చేసారు. ఈ ఘటనలో వాహనంలో ఉన్న 15 మంది జవాన్లు, డ్రైవర్ కూడా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి వాహనo తునాతునకలైంది. రాష్ట్రంలో గత రెండేళ్లలో మావోలు జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడిగా పోలీసులు చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని దాదాపూర్ లో పురాందా-మాలేగావ్-యెర్కడ్ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న 36 వాహనాలకు నక్సల్స్ నిప్పుపెట్టారు. దగ్ధమైన వాహనాలను పరిశీలించేందుకు ఒక ప్రైవేటు వాహనంలో వెళ్తున్న క్విక్ రెస్పాన్స్ పోలీస్ కమాండో టీంను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ మెరుపుదాడి చేసారు. పక్కా ప్రణాళిక ప్రకారం మార్గమధ్యంలో ఐఈడీ బాంబులను అమర్చి వాహనాన్ని పేల్చివేసారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మావోల దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. ఇంతటి దారుణానికి తెగబడిన వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని తెలిపారు.
Maoist Attack in Gadchiroli || 1 Security Personnel Dead || 16 Injured || Maharashtra - YouTube |
| 1 Likes | 1 Dislikes |
| 24 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 1 May 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét