
AMPM Live : విశాఖపట్నంలోని 69వ వార్డు ప్రహ్లాదపురం దరి బొబ్బిలివారి వీధిలో గల సింహగిరి నిలయం అపార్ట్ మెంట్ లో చోరీ జరిగింది. నేవల్ డాక్ యార్డ్ విశ్రాంత ఉద్యోగి ఎస్.సత్యనారాయణ మూర్తి నివాసంలో 8 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, రూ.66 వేల నగదును దొంగలు అపహరించుకుపోయారు. ఫ్లాట్ కు ఉన్న కిటికీ గ్రిల్స్ ను తొలగించి దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడు ఎస్.సత్యనారాయణ తన భార్యతో కలిసి దొండపర్తిలోని తమ కుమార్తె నివాసానికి సోమవారం వెళ్లారు. ఇంటి తాళాలు పక్కింటి వారికి ఇచ్చారు. కేబుల్ మరమ్మత్తుల కోసం మెకానిక్ రావడంతో పక్కింటి వారు సత్యనారాయణకు ఫోన్ చేసి తాళాలు తీసారు. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండడంతో ఇంటి యజమానికి సమాచారం అందించారు. దీంతో యజమాని సత్యనారాయణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ లతో విచారణ చేపట్టారు. అపార్ట్ మెంట్ లకు సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని, దొంగలను అతి త్వరలో పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు.
Massive Robbery At Prahaladapuram in Visakhapatnam - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 50 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 21 Nov 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét