
AMPM Live : విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి దారుణo చోటు చేసుకుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే కాంప్లెక్స్ వద్ద ఓ యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన స్థానీకంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెలితే.. ఆర్టీసీ కాంప్లెక్స్ దరి ద్వారకా మద్యం దుకాణంలో పెద్దా సురేష్ అనే ఆటోడ్రైవర్ మద్యం తాగి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఓ ఆటోలోంచి దిగిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సురేష్‌పై దాడికి దిగారు. అతడిని కత్తులతో ఎడమ కాలు, ఎడమ చేతిపై పొడిచి, రాడ్డుతో తల వెనుక భాగంలో బలంగా మోదారు. దీంతో సురేష్ తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో చనిపోయాడనుకొని వచ్చిన ముగ్గురూ ఆటోలోనే రామాటాకీస్ వైపు పరారయ్యారు. స్థానికులు వెంటనే ద్వారకా పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని హుటాహుటిన సురేష్ ను సీతమ్మధార ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్చారు. డీసీపీ ఫకీరప్ప, మూడో పట్టణ సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, అక్కడున్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Murder Attempt at RTC Complex || Visakhapatnam || Police Starts Investigation - YouTube |
| 36 Likes | 36 Dislikes |
| 20,583 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 29 Dec 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét