
AMPM Live : నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్.కె.బీచ్ తీరం జనసంద్రంగా మారింది. పాకిస్తాన్‌పై 1971లో సాధించిన విజయానికి చిహ్నంగా ప్రతి ఏటా డిసెంబరు 4న నేవీ డే ను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆర్.కె.బీచ్ లో తూర్పు నౌకాదళం ప్రదర్శించిన సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరంబీర్‌సింగ్ నేతృత్వంలో నిర్వహించిన నేవీ డే ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ హరిబాబు పాల్గొన్నారు. గంటకు 2100 కిలోమీటర్ల వాయువేగంతో దూసుకుపోయే సుఖోయ్ యుద్ధ విమానాలు నౌకాదళ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటూ బి.ఎం.సి యుద్ధట్యాంకులు, తీరంలో నిఘా అవసరాల కోసం వినియోగించే డోర్నియర్ లు, హాక్ ఎయిర్ క్రాఫ్ట్, మెరైన్ కమాండోల విన్యాసాలు అలరించాయి. భారత సైన్యం నింగి, నేల, నీటిపై శత్రుమూకలపై దాడికి ఎల్లప్పుడూ సిద్ధమని నౌకాదళ విన్యాసాలు చాటి చెప్పాయి.
Navy Day Celebration 2018 in Vizag || R.K.Beach || AMPM Live - YouTube |
| 5 Likes | 5 Dislikes |
| 100 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 4 Dec 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét