
AMPM Live : ఉత్తరాంధ్ర జిల్లాల వైపు మరో భీకర తుఫాను దూసుకొస్తుంది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ తుఫానుకు ‘తిత్లీ’గా నామకరణం చేసారు. బుధవారం తిత్లీ పెను తుఫానుగా మారనుందని.. దీని ప్రభావంతో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తుఫాను తీరం దాటి పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించి క్రమoగా బలహీనపడుతుందని వివరించారు. దీంతో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులను చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో బుధవారం తెల్లవారుజాము నుంచి విశాఖలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.
Odisha, Andhra on Red Alert as Cyclone Titli Inches Close - YouTube |
| 8 Likes | 8 Dislikes |
| 3,261 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 9 Oct 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét