
AMPM Live : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకూ భానుడి ప్రతాపం పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో ఉక్కబోత, ఎండ వేడిమితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయట తిరగకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రజలకు ఊరటనిచ్చే వార్తను వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోమెరిన్ ప్రాంతం వరకూ కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కోస్తాంధ్రలో మెరుపులు, ఉరుములతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
Rain Fall in Next Three Days || Weather Forecast || Andhra Pradesh - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 53 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 19 Apr 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét