
AMPM Live : ఆమె సేవలు సమాజహితం.. ఆమె ఆశయాలు యువతకు ఆదర్శం.. ఆమె వైద్యం పేదలకు వరం. వైద్యో నారాయణో హరి అన్న నానుడికి నిలువెత్తు రూపంగా విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం, పరిసర ప్రాంత ప్రజలకు 25 ఏళ్లుగా నిస్వార్ధమైన వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ ‘కాండ్రేగుల వెంకట సత్యవతి’. వివేకానంద ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సేవారంగంలో ప్రత్యేక ముద్ర వేసారు. వేలాది మంది మహిళలకు ప్రసవాలు చేసి సత్యవతి‘అమ్మ’గా పేరు గడించారు. విశాఖజిల్లా ఎస్.రాయవరం గ్రామంలో భీశెట్టి జగన్నాధరావు, దేముళ్లమ్మ దంపతులకు సత్యవతి జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ విద్యను పూర్తి చేసిన సత్యవతి.. విశాఖ విక్టోరియా మెటర్నటీ ఆసుపత్రి నుంచి గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. పీజీ చదువుతున్న సమయంలోనే తన సహచర మిత్రుడు, విశాఖజిల్లా చూచుకొండ గ్రామానికి చెందిన ప్రముఖ ఇ.ఎన్.టి వైద్య నిపుణులు, డాక్టర్ కాండ్రేగుల విష్ణుమూర్తితో 1992లో ఆమె వివాహం జరిగింది. కట్నానికి అతీతంగా జరిగిన వీరి వివాహం ఆదర్శప్రాయంగా నిలిచింది.
Social Services By Doctor K.V.Satyavathi || Anakapalle || Visakhapatnam District - YouTube |
| 23 Likes | 23 Dislikes |
| 720 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 27 Feb 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét