
AMPM Live : కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిరసనగా తాము చేపట్టిన ఆందోళనకు ఇది ఆరంభం మాత్రమేనని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలోని వెంకటపాలెం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి సైకిల్ యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు స్వయంగా సైకిల్ నడుపుతూ ర్యాలీకి నాయకత్వం వహించారు. తొలుత నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ... కేంద్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటోందని, ఇదెంతో దుర్మార్గమని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే బీజేపీకి కూడా కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
TDP Cycle, Bike Rally || CM Chandrababu Naidu || Amaravathi - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 35 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 6 Apr 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét