
AMPM Live : ప్రతి మనిషి జీవితంలో టీనేజ్ అనేది ఒక కీలకమైన దశ. ఈ వయసే భవిష్యత్తును నిర్ధారించేది కూడా. బాగా చదువుకుని, ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్ధులు నేడు మత్తుపదార్ధాలకు బానిసలై పెడదోవ పడుతున్నారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఈ సంస్కృతి మరింత పెరుగుతోంది. సినిమాల ప్రభావం కావచ్చు.. తోటి విద్యార్ధుల ప్రోత్సాహం కావచ్చు.. యువత సిగరెట్లు తాగడం ఒక ఫ్యాషన్ గా భావిస్తున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో పట్టపగలే గుప్పుమని పొగ పీలుస్తూ కనిపిస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా సరదాగా చేసే ఈ చేష్టలు చివరికి వ్యసనంగా మారుతున్నాయి. పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్ధులకు కౌన్సిలింగ్ లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయాన్ని వెచ్చించి... చెడు వ్యసనాల బారిన పడకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
Teenage || Youth || Drugs || Smoking || Visakhapatnam - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 36 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 23 Sep 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét