
AMPM Live : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే ఎన్టీఆర్ చనిపోయారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన... కన్నీటిపర్యంతం అయ్యారు. ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తన రాజకీయ జీవితాన్ని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గవర్నర్ చేస్తానని, రాజ్యసభకు పంపిస్తానని చెప్పి.. ఆ తర్వాత మోసం చేశారని అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని... ఇప్పుడు కనీసం మహానాడు కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదని వాపోయారు. ఎన్టీఆర్ పార్టీకి తనను దూరం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబుకు పాలించే అర్హత కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
TTDP Leader Mothukupalli Narasimhulu Sensational Comments on ChandrababuNaidu || Sr NTR Demise Issue - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 25 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 28 May 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét