
AMPM Live : రెక్కల కష్టం మీద బ్రతికే రైతును లంచం కోసం వేధించాడు ఆ అధికారి. పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి రూ.9 వేలు లంచం డిమాండ్ చేసాడు. దిక్కుతోచని స్థితిలో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. వి.మాడుగుల మండలo కేజే పురం గ్రామానికి చెందిన భీశెట్టి జగ్గారావు అనే రైతు తన కుటుంబానికి చెందిన 9 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వీఆర్వో రామకృష్ణను సంప్రదించాడు. పాస్ పుస్తకాలు కావాలంటే తలకు రూ.9 వేలు లంచం కావాలని రామకృష్ణ అడిగాడు. దీంతో జగ్గారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో బృందం రంగంలోకి దిగింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం మాడుగుల తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వో రైతు వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచగొండి అధికారిపై కేసు నమోదు చేసారు.
VRO Caught Red Handed By ACB in Madugula || Visakhapatnam District - YouTube |
| 6 Likes | 6 Dislikes |
| 486 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 14 Nov 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét