
AMPM Live : #Prajasankalpayatra వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖజిల్లాలోకి ప్రవేశించింది. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లి నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించారు. నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్ కు మహిళలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్ వెంట నడిచేందుకు విశాఖ జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. వర్షం పడుతున్నా లెక్క చేయక జగన్ పాదయాత్రను కొనసాగించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మంగళవారం విశాఖజిల్లాలో పాదయాత్ర శరభవరం, శృంగవరం, గాంధీనగర్, వై దొండపేట జంక్షన్, ఎర్రవారం మీదుగా కొనసాగనుంది. సుమారు నెల రోజుల పాటు జగన్ జిల్లాలో పాదయాత్ర ద్వారా పర్యటించనున్నారు.
Y.S.Jagan Prajasankalpayatra Enter in Visakhapatnam District - YouTube |
| 26 Likes | 26 Dislikes |
| 712 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 14 Aug 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét