
AMPM Live : సినీనటుడు కమలహాసన్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. తన అభిమాని చెంప ఛెళ్లుమనిపించినట్లు ఉన్న ఓ వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఇటివల చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కమల్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు. కమల్ మెట్లు దిగుతున్న సమయంలో ఓ అభిమాని ఆయనను చూసి కరచాలనం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ అభిమానిని కమలహాసన్ లాగి కొట్టాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే కమల్ మాత్రం తాను ఎవరినీ కొట్టలేదని, మీద పడుతుంటే వెనక్కి నెట్టానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కమల్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులతో ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
AMPM Live : kamal Hassan slaps his Fan || Viral video - YouTube |
| 1 Likes | 1 Dislikes |
| 48 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 27 Nov 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét