
AMPM Live : విశాఖ సాగరతీరం భారత తూర్పు నౌకాదళం శక్తిసామర్ధ్యాలను చాటిచెప్పింది. నింగి, నీరు నౌకాదళ సాహస విన్యాసాలకు సాక్ష్యాలుగా నిలిచింది. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే యుద్ధ విమానాలు.. కళ్ళు చెదిరే వైమానిక సాహసవిన్యాసాలు.. విశాఖవాసులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసాయి. సోమవారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో ఘనంగా ప్రారంభమైన నేవీ డే వేడుకలు అంబరాన్నంటాయి. హెలికాప్టర్లు, పారాచూట్, ఆయుధాలతో యుద్ధభూమిని తలపించే రీతిలో సైనికులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు నౌకాదళ శక్తిసామర్ధ్యాలకు అద్దంపట్టాయి. భారత నౌకాదళ ఆయుధ సంపత్తి, సముద్రంతలంపై నేవీకున్న పట్టు, శత్రువుల గుట్టు రట్టు చేసి వారిని మట్టుబెట్టే తీరు, విపత్కర సమయాలను ఎదుర్కొనే నేర్పు వంటి వాటిని ఈ సందర్భంగా ప్రదర్శించారు. నేవీ బ్యాండ్‌తో ప్రారంభమైన విన్యాసాలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. తీరం వెంబడి నౌకలు విద్యుత్ అలంకరణలతో మెరిసిపోయాయి.
AMPM Live : Navy Day celebrations 2017 || Visakhapatnam - YouTube |
| 3 Likes | 3 Dislikes |
| 112 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 4 Dec 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét