
AMPM Live : విశాఖ సాగరతీరం నౌకదళ దినోత్సవ వేడుకలకు ముస్తాబయ్యింది. సోమవారం నేవీ డేను పురస్కరించుకుని నౌకదళ సిబ్బంది ఆర్కే బీచ్ లో అబ్బురపరిచే విన్యాసాలు చేసేందుకు సిద్దమవుతున్నారు. తూర్పు నౌకాదళ ఆధ్వర్యంలో సాగరతీరంలో సాహసోపేత, ఉత్కంఠభరిత విన్యాసాలు జరగనున్నాయి. స్పీడు బోట్లు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, పారాషూట్లు వంటి వాటితో విన్యాసాలు చేసి తూర్పునేవీ శక్తి సామర్ధ్యాలు ప్రదర్శిoచనున్నారు. నేవీడే వేడుకలను చూసేందుకు విశాఖ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విన్యాసాలు సాయoత్రం 4గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ రోడ్ వైపు వెళ్ళే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాగరతీరంలో ఆదివారం నౌకదళ సిబ్బంది చేపట్టిన రిహార్సల్స్ నగరవాసులను ఆకట్టుకున్నాయి.
AMPM Live : Navy Day Rehearsals in Beach Road Visakhapatnam - YouTube |
| 5 Likes | 5 Dislikes |
| 824 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 4 Dec 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét