
AMPM Live : బ్లాక్ చైన్ పరిజ్ఞానంతో భద్రత, భవిష్యత్తు ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన రెండు రోజుల అంతర్జాతీయ బ్లాక్ చైన్ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో 25 దేశాల నుంచి ఐటీ, ఫైనాన్స్ కంపెనీలకు చెందిన 80 మంది సీఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ బ్లాక్ చైన్ నిపుణులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత అనేది చాలా ముఖ్యమని, నగదు రహిత లావాదేవీల పూర్తి భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీస్ దోహదపడుతుందని అన్నారు. ఏపీని ప్రపంచంలోనే టెక్నాలజీ, క్లౌడ్ హబ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
Block Chain Conference || Chandrababu Naidu || IT Jobs || Visakhapatnam - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 71 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 10 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét