
AMPM Live : భారత నౌకాదళoలో తొలి మహిళా పైలట్ గా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన శుభాంగి స్వరూప్ చరిత్ర సృష్టించారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని మరోసారి నిరూపించారు. సముద్రాలపై నిఘా ఉంచే నౌకాదళ విమానాలకు ఒక మహిళ పైలట్ గా పనిచేయడం ఇదే ప్రధమం. మరికొద్దిరోజులలో భారత నేవీలో శుభాంగి తన సేవలను అందించనున్నారు. శుభాంగి ఓ నావికా కమాండర్ కుమార్తె కావడం విశేషం. ఈమెతో పాటూ నౌకాదళ ఆయుధాల పర్యవేక్షణ విభాగం (ఎన్ఏఐ) లోనూ ముగ్గురు మహిళా అధికారులు (ఆస్థా సెగల్(దిల్లీ), రూపా ఏ(పుదుచ్చేరి), శక్తి మాయా ఎస్(కేరళ) ) తొలిసారిగా నియమింపబడ్డారు. ఈ నలుగురూ కేరళలోని ఎఝిమల నౌకాదళ అకాడమీలో నౌకాదళ ఓరియెంటేషన్ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. శిక్షణ అనంతరం వీరు తమ విధుల్లో చేరతారు.
India's First Woman Navy Pilot - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 19 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 24 Nov 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét