
AMPM Live : సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా బుధవారం రాత్రి చంద్రుడు సూపర్, బ్లూ, బ్లడ్ మూన్ గా ఆకాశంలో కనువిందు చేశాడు. అద్భుతమైన రీతిలో చంద్రుడు వివిధ రూపాల్లో దర్శనమిచ్చాడు. సుమారు 150 ఏళ్ల తర్వాత ఈ రీతిలో సంభవించిన సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ప్రజలు మూఢ నమ్మకాలను పక్కన పెట్టి డాబాలు, ఎత్తైన భవనాలపై నుంచి ఈ దృశ్యాన్ని వీక్షించారు. మరికొందరు విశాఖ సాగరతీరానికి చేరుకొని ఈ అద్భుతాన్ని తిలకించారు. మరో వైపు సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ప్రజలు ఉదయాన్నే సముద్రంలో స్నానాలు చేసి ఉపవాస దీక్షలు చేపట్టారు. గ్రహణం పట్టు స్నానాలు చేసి, గ్రహణం వీడిన తరువాత విడుపు స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు విరమించారు. గ్రహణం వీడిన పున్నమి చంద్రుడు చల్లని వెన్నెలతో వెలుగులు విరజిమ్మాడు. దీంతో సాగర తీరం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అటు సైన్స్ ప్రకారం ఈ అరుదైన దృశ్యాల్ని తిలకిస్తూ.. ఇటు విశ్వాసాల పరంగా ప్రజలు కొన్ని ఆచారాలను కూడా పాటించారు.
Rare Super Blue Blood Moon Eclipse Thrills Millions Around the World - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 17 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 31 Jan 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét