
AMPM Live : వికలాంగ యువతిపై పాస్టర్ అఘాయిత్యం దైవ ప్రార్ధనల పేరుతో ఒక వికలాంగ యువతిపై పాస్టర్ అమానుషానికి తెగబడ్డాడు. ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని గర్భవతిని చేసాడు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం జెడ్.మేడపాడు గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జెడ్.మేడపాడు గ్రామానికి చెందిన జిత్తుగ పద్మ (22) అనే యువతి మూగ, చెవిటితో పాటూ చిన్నతనంలోనే పోలియో వ్యాధికి గురైంది. తల్లిదండ్రులు లేకపోవడంతో తన తమ్ముడు, బంధువులతో కలిసి నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన పాస్టర్ ఓగిసెట్టి రాజారావు (55) యువతిని ప్రార్ధనల పేరుతో తరచుగా బయటికి తీసుకువెళుతుండేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం యువతికి విపరీతంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆమె 7 నెలల గర్భవతి అనే తేలడంతో అందరూ విస్తుపోయారు. ఏం జరిగిందని బాధిత యువతిని కుటుంబసభ్యులు ప్రశ్నించగా... ఆమె సైగల ద్వారా పాస్టర్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వివరించింది. దీంతో వారు పాస్టర్ ను నిలదీయగా తనకేం సంబంధం లేదంటూ ముఖం చాటేసాడు. వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కూలి పనుల కోసం తాము బయటకు వెళ్లినప్పుడు.. పాస్టర్ యువతిని ప్రార్ధనలు చేయిస్తానని తరచూ తీసుకెళ్ళేవాడని.. మంచి మాటలు చెప్పే వ్యక్తి అని నమ్మితే.. ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Physically Disabled Girl Raped at East Godavari || Accused Arrested - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 191 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 8 May 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét