
AMPM Live : నెల్లూరు జిల్లా ఉదయగిరి డివిజన్ లో రూ.2కోట్లు విలువ చేసే 88 ఎర్ర చందనం దుంగలను మంగళవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు తనిఖీలు చేపట్టిన ఓఎస్టీ టాస్క్ ఫోర్స్ బృందం ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర స్మగ్లర్లను పట్టుకున్నారు. నిందితులు మాణిక్య, ధనశేఖర్, శేఖర్, మునిస్వామిలను మీడియో సమావేశంలో ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. వీరు ఇప్పటివరకూ 100 టన్నుల ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలించినట్లు సమాచారం ఉందన్నారు. వీరిపై సంబంధిత సెక్షన్లతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఉదయగిరి సీఐ ఎం.వి.సుబ్బారావు ఎస్ఐ నక్క ప్రభాకర్, పోలీసు సిబ్బంది, పారెస్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Police Seized Worth Rs 2 Crore Red Sandal in Nellore - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 57 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 6 Feb 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét