
AMPM Live : సెప్టెంబర్ 1 నుంచి ఆర్.కె.బీచ్ రోడ్డులో శని, ఆదివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ విభాగం అడిషనల్ డిప్యూటీ కమీషనర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసారు. ఆర్.కే.బీచ్ రోడ్డులో వాహనాల రద్దీ, టూరిస్టుల భద్రత దృష్యాడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు బీచ్ రోడ్డులో పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్.టి.ఆర్ విగ్రహం జంక్షన్ వైపు రోడ్డులో శని, ఆదివారాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఎలాంటి వాహనాలు అనుమతించకుండా... బీచ్ వైపు ఉన్న రోడ్డును సందర్శకుల కారులు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు మాత్రమే వినియోగించనున్నారు. దీనికి సంబంధించి బీచ్ రోడ్డులో మార్కింగ్ ప్రక్రియను ట్రాఫిక్ పోలీసులు వేగవంతం చేసారు.
Traffic Police New Instructions in R.K.Beach Road || Visakhapatnam - YouTube |
| 7 Likes | 7 Dislikes |
| 466 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 1 Sep 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét