
AMPM Live : విశాఖలో బీజేపీ, సీపీఐ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఒకరోజు ఉపవాస దీక్షకు మద్దతుగా గురువారం విశాఖలో ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా బీజేపీ నగరశాఖ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. అదే సమయంలో ర్యాలీగా తరలివచ్చిన సీపీఐ నేతలు, కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విశాఖ బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో బీజేపీ, సీపీఐ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుని తీవ్ర రూపం దాల్చింది. ఇరు పార్టీల కార్యకర్తలు చెప్పులు, వాటర్ బాటిళ్ళతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ చెదరగొట్టి బీజేపీ నాయకుల దీక్షను భగ్నం చేసారు.
BJP, CPI Party workers clash in Vizag Protests - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 54 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 12 Apr 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét