
AMPM Live : రైతాంగ కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా యువత శక్తివంచన లేకుండా కృషి చేయాలని తెలుగుదేశం నాయకులు, ఏపీ జన్మభూమి సమన్వయకర్త పైలా ప్రసాదరావు కోరారు. ఆదివారం దేవరాపల్లి మండలం మారేపల్లిలో పైలా యువసేన మండలస్థాయి సమావేశం ఘనంగా జరిగింది. యువసేన అధ్యక్షుడు కామిరెడ్డి ఎరుకునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పైలా ప్రసాదరావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దేవరాపల్లికి సామాజికంగా, ఆర్ధికంగా, సంస్కృతి పరంగా ప్రత్యేక గుర్తింపు వుందన్నారు. ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం పొందుతున్న విశాఖపట్నం నగరానికి తాగునీరు అందిస్తున్న ఘనత దేవరాపల్లి ప్రాంతానిదన్నారు. రైవాడ రైతుల త్యాగానికి తగ్గ గుర్తింపు.. నష్ట పరిహారం.. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం చారిత్రాత్మక తప్పిదమే అన్నారు. రైవాడ అంశంపై ఉద్యమాలు నడిపి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎందరో పదవులు పొందారు తప్పితే, రైతులకు తగిన న్యాయం జరగలేదన్నారు. రైవాడ జలాశయాన్ని ఆధునీకరించడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. యువత సమైక్యంగా కదిలి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంతకుముందు దేవరాపల్లి మండల యువసేన కార్యకర్తలు కేంద్రం ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, చంద్రబాబుకు యువత అంతా అండగా నిలవాలని నినదిస్తూ కింతాడ నుంచి మారేపల్లి వరకూ నిర్వహించిన బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పైలా యువసేన మండల అధ్యక్షుడు జి.కొండలరావు, సీనియర్ తెలుగుదేశం నాయకులు, దొగ్గ నాయుడుబాబు, రాజునాయుడు, బండారు తాతబాబు, లెక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Paila Yuvasena Meeting || Bike Rally || Devarapalli || Visakhapatnam - YouTube |
| 9 Likes | 9 Dislikes |
| 463 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 15 May 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét